Tuesday, June 16, 2020

వకీల్ సాబ్ సినిమాకి శృతి హాసన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0
శృతి హాసన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ "వకీల్ సాబ్" షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు దిల్ రాజు, బోని కపూర్. 

Follow us:

హిందీలో సూపర్ హిట్ అయిన "పింక్"మూవీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో  పవన్ లుక్ ఇప్పటికే అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసింది, అంతే కాకుండా చిత్రబృందం విడుదల చేసిన "మగువ మగువ" అనే సాంగ్ రికార్డులను సృష్టించింది. అయితే ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు.  ప్రస్తుతం ఈ సినిమాకు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం, కానీ ఈ సినిమా కు శృతి 70 లక్షలు రెమ్యూనరేషన్ అడిగిందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువ నిడివి ఉంటుందట, 7 రోజుల షూటింగ్ కి 70 లక్షలు అడగడంతో నిర్మాతలు ఆలోచనలో పడినట్టు టాక్. 


About Admin
i am a die-hard fan of Power Star Pawan Kalyan. keep watching this space for more updates of Power star

No comments:

Post a Comment