Pawan Kalyan OG Movie |
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నారు, రాజకీయాలలో తమ అభిమాన హీరో సక్సెస్ అవడంతో పట్టలేని ఆనందంతో ఉన్నారు అభిమానులు. అయితే ఒక వైపు రాజకీయాలను చేస్తూనే సినిమాలలో కూడా నటించాలని కోరుతున్నారు. ఇటీవల పిఠాపురంలో జరిగిన రోడ్ షో లో కూడా OG సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ సందడి చేసారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఒక రెండు మూడు నెలల తరువాత సినిమాల గురించి ఆలోచిస్తానని ప్రస్తుతం తన ద్రుష్టి అంత ప్రజలకి సేవ చేయడం మీదే ఉందని చెప్పారు.
ప్రస్తుతం మూడు సినిమాలు(హరిహర వీరమల్లు, OG , భవదీయుడు భగత్ సింగ్) షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడ్డాయి. అందులో ముఖ్యంగా సుదీప్ డైరెక్షన్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న OG సినిమా ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండటంతో సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.
OG మూవీ టీజర్: