పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2024 లో పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో జనసైనికులు, వీర మహిళలు కృషి ఎంత ఉందొ సోషల్ మీడియా విభాగం కృషి కూడా అంటే ఉందని చెప్పక తప్పదు. జనసేన పార్టీ కి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నందు అకౌంట్స్ ని ఉన్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో పార్టీ అధికారిక ఛానల్ కి 18 లక్షలకు పైగా subscribers ఉన్నారు.
నిన్న రాత్రి 10:30 గంటల నుండి జనసేన పార్టీ ఛానల్ హ్యాకింగ్ కు గురైనట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఎలోన్ మాస్క్, డోనాల్డ్ ట్రంప్ లైవ్ వీడియో ఛానల్ లో ప్రసారం చేయబడింది. ఛానల్ లోగో కూడా టెస్లా కి చెందిన లోగో కి మార్చడం జరిగింది. దీనితో జనసైనికులు అయోమయానికి గురయ్యారు. దీనితో ఛానల్ హాకింగ్ బారిన పడినట్టు తెలుస్తుంది. ఈ పోస్ట్ పబ్లిష్ చేసే సమయానికి యూట్యూబ్ లో అసలు జనసేన ఛానల్ కూడా కనపడటం లేదు. మరి జనసేన సోషల్ మీడియా విభాగం ఛానల్ ని హైడ్ చేసిందా లేక హ్యాకర్లు ఛానల్ ని డిలీట్ చేసారో ఇంకా తెలియరాలేదు. దీని గురించి జనసేన తరుపున కూడా ఎటువంటి అప్డేట్ లేదు. గత ఏప్రిల్ లో కూడా ఒకసారి జనసేన యూట్యూబ్ ఛానెల్ హ్యాకర్స్ బారిన పడిన సంగతి తెలిసిందే.